దురాశ ఫలితం Small Moral Stories in TELUGU PDF

Small Moral Stories in TELUGU PDF
దురాశ ఫలితం Small Moral Stories in TELUGU PDF

ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. అతడు పేదవాడు, ఎంతో దారిద్య్రంతో బాధపడుతున్నాడు. ఇంత పేదరికం అనుభవిస్తూ కూడా ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు తన ఇంటికి సమీపంలో ఉన్న పాము పుట్టలో పాలు పోసేవాడు. బ్రాహ్మణుని పేదరికానికి పాము జాలిపడింది. బ్రాహ్మణుడు తనకు పాలుపోసిన ప్రతిరోజు అతనికి ఒక విలువైన వజ్రాన్ని ఇచ్చేది. దాంతో బ్రాహ్మణుడి పేదరికం దూరమైంది. కొంత కాలంలోనే అతడు సంపన్నుడయ్యాడు. ఊళ్ళో వాళ్ళందరూ బ్రాహ్మణుకి ఏవో లంకెబిందెలు దొరికాయని చెప్పుకున్నారు. ఒకరోజు పనిపై బ్రాహ్మణుడు వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది. అతడు తన కుమారుడ్ని పిలిచి “నాయనా! నేను ఊరికి వెళుతున్నాను. కొద్దిరోజుల పాటు అక్కడే ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి నువ్వు ప్రతిరోజు ఈ పుట్టలోని పాముకు పాలు పొయ్యి. ప్రతిరోజు ఆ సర్పం నీకు ఒక వజ్రాన్ని ఇస్తుంది. దాన్ని ఇంట్లో భద్రంగా దాచిపెట్టు” అని చెప్పి బ్రాహ్మణుడు ఊరికి వెళ్ళిపోయాడు.

తండ్రి చెప్పినట్టే కుమారుడు పాము పుట్టలో పాలు పోశాడు. పాము ఒక వజ్రాన్ని ఇచ్చింది. పాము వల్లే తమకు ఇంత సంపద వచ్చిందని బ్రాహ్మణుడి కుమారుడు గ్రహించాడు. ‘ప్రతిరోజూ ఒక వజ్రం ఇస్తుందంటే పుట్టలో ఎన్ని వజ్రాలు ఉన్నాయో? అన్ని వజ్రాలను ఒక్కసారి దక్కించుకుంటాను’ అని బ్రాహ్మణుని కుమారుడు మనస్సులోనే ఆలోచించుకున్నాడు. ఆలస్యం చేయకుండా ఊళ్ళోవాళ్లకు విషయం చెప్పాడు. గ్రామస్తులందరికి దురాశ కలిగింది. వజ్రాలను సొంతం చేసుకోవాలని అందరూ కలసి పుట్టను తవ్వారు. పుట్టలో ఎటువంటి వజ్రాలు దొరక్కపోగా పాము మాయమైపోయింది. ఏం చేయాలో పాలుపోక గ్రామస్తులంతా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఊరి నుండి వచ్చిన బ్రాహ్మణుడు తన కుమారుడి ద్వారా విషయాన్ని తెలుసుకుని బాధపడ్డాడు. కొద్దిరోజులు పాముకోసం వెతికాడు. ఒకరోజు వేరొక పుట్టలో పాము కనపడింది.

“సర్పరాజమా! నా కుమారుడి వల్ల పొరపాటు జరిగింది. నువ్వు మా ఇంటికి వస్తే వేరొక పుట్టను నిర్మిస్తాను. దయచేసి మా ఇంటికి రా” అని బ్రాహ్మణుడు ఆహ్వానించాడు. “బ్రాహ్మణోత్తమా! నీ కుమారుడి వల్ల నాకు ప్రాణహాని ఉంది. అందువల్ల నీ ఆహ్వానాన్ని మన్నించి నీ ఇంటికి రాలేను. జరిగిన విషయాన్ని నీకు తెలియజేసి వెళ్ళిపోవాలని ఇక్కడ ఉన్నాను” అని చెప్పి పాము శాశ్వతంగా బ్రాహ్మణునికి దూరమైంది. తన కుమారుడు తెలియనితనం, అతనితోపాటు ప్రజల దురాశ ఫలితంగా తాను ప్రతిరోజుసర్పం నుండి పొందుతున్న సంపదను కోల్పోవలసి వచ్చినందుకు బ్రాహ్మణుడు బాధపడ్డాడు.

MORAL : మనం ఒక పనిని వేరే వాళ్ళకి చెప్పినప్పుడు, ఆ వ్యక్తి ఆ పనిని సరిగ్గా చేస్తాడో లేదో మనం ఆలోచించాలి. అప్పుడు ఆ వ్యక్తికి పని చెప్పాలి.

బ్రాహ్మణుడు, రాక్షసుడు మరియు దొంగ Small Moral Stories in TELUGU PDF

Small Moral Stories in TELUGU PDF
బ్రాహ్మణుడు, రాక్షసుడు మరియు దొంగ Small Moral Stories in TELUGU PDF

ఒక బ్రాహ్మణుడు అడవికి సమీపాన తన నివాసాన్ని ఏర్పాటుచేసుకున్నాడు. బ్రాహ్మణుడి నివాసానికి కొంచెం దూరంలో ఒక రాక్షసుడు నివాసం ఉంటున్నాడు. ఎర్రగా నిగనిగలాడుతున్న బ్రాహ్మణుని తినాలని రాక్షసుడికి ఎప్పటి నుండో కోరిక. అయితే సమయం దొరకడంలేదు. ఒకరోజు బ్రాహ్మణుని మింగాలని అతడి ఇంటి ప్రక్కనే రాక్షసుడు ఎదురుచూస్తూ కూర్చున్నాడు. అదే సమయంలో ఒక దొంగ ఒంటినిండా నల్లని రంగు పూసుకుని బ్రాహ్మణుని ఇంటిలో ఉన్న విలువైన వస్తువులను దోచేయాలని వచ్చాడు. రాక్షసుడు దొంగ కంటపడ్డాడు. దొంగ భయపడి అరవబోయాడు. “అరవకు” అని రాక్షసుడు అన్నాడు. “నువ్వెందుకు వచ్చావు” దొంగ ప్రశ్నించాడు. దొంగ ప్రశ్నకు బదులిస్తూ “అడవిలోకి ఎవరూ రావడం లేదు. ఆహారం దొరక్క ఆకలితో మలమల మాడి పోతున్నాను. అడవి సమీపాన ఈ బ్రాహ్మణుడు నివాసం ఏర్పరచుకున్నాడు. ఇతడ్ని మింగేయాలనేది నా కోరిక. ఇంతకాలానికి ఒంటరిగా చిక్కాడు. అయినా ఇక్కడికి నువ్వెందుకొచ్చావు?” అడిగాడు రాక్షసుడు.

“ఊళ్ళో దొంగతనాలు ఎక్కువ కావడంతో జనమంతా మెలకువతో ఉండి కాపలా కాస్తున్నారు. వాళ్ళ కంటపడితే కొడతారని భయపడి ఇక్కడికి వచ్చాను. ఇక్కడైతే నన్ను ఎవరూ పట్టుకోలేరు. అందువల్ల నేను ఈ బ్రాహ్మణుడి ఇంటికి దొంగతనం చేయాలని వచ్చాను” అన్నాడు దొంగ. “ఈరోజు నుండి మనిద్దరం మిత్రులం. ముందుగా నేను వెళ్ళి బ్రాహ్మణుని మింగేస్తాను. ఆ తరువాత నువ్వు రా” అన్నాడు రాక్షసుడు. “నేను నిన్నెలా నమ్ముతాను. బ్రాహ్మణుని నువ్వు మింగేస్తే ఆతరువాత నన్ను వదులుతావని ఎలా అనుకుంటాను? కాబట్టి ముందుగా నేను వెళ్ళి బ్రాహ్మణుని ఇంట దొంగతనం చేసి వెళ్ళిపోతాను. ఆ తరువాత నువ్వు వెళ్ళి బ్రాహ్మణుని మింగి వెళ్ళిపో” అన్నాడు దొంగ.

నేను ముందు వెళతాను అంటే నేను ముందు వెళతాను అని వారిద్దరూ వాదించుకున్నారు. ఈ వాదన పెరిగి పెద్ద గొడవైంది. దాంతో బ్రాహ్మణుడు ఇంటి నుండి బయటకు వచ్చి చూస్తే రాక్షసుడు, ఒంటినిండా నల్లని రంగును పూసుకున్న గజదొంగ కనిపించారు. వెంటనే ఇంట్లోకి వెళ్ళి అందరినీ నిద్రలేపాడు. జనాన్ని చూసి దొంగ పారిపోగా, అందరూ ఆంజనేయస్వామి దండకం చదివారు. ఆంజనేయస్వామి పేరు వినగానే రాక్షసుడు కూడా పారిపోయాడు. దొంగ, రాక్షసుడి తగువు వల్ల బ్రాహ్మణుడు తప్పించుకోవడానికి మేలు జరిగింది.

MORAL : మనము ఏదైనా పని అనుకుంటే, బాగా ఆలోచించి వెంటనే అమలు చేయాలి.

మాట్లాడే గుహ Small Moral Stories in TELUGU PDF

ఒక అడవిలోని గుహలో నక్క నివసిస్తుంది. ఒకరోజు ఉదయాన్నే అది ఆహారపు వేటలో బయలుదేరింది. ఇంతలో ఆకలితో ఉన్న ఒక సింహం ఆవైపు వచ్చి గుహను చూసింది. “ఉదయం నుండి చూస్తున్నా, నాకు ఆహారం దొరకకుండా, ఒక్క జంతువు కూడా కనిపించడం లేదు, నేను ఆకలితో పడిపోయేటట్టు ఉన్నాను. ఈ గుహలో ఏదైనా జంతువు ఉంటే తింటాను” అని సింహం భావించి గుహలోకి వెళ్ళింది. కొద్దిసేపటికి నక్క తన నివాసమైన గుహ వద్దకు వచ్చి సింహం అడుగు జాడలను గుర్తించింది. “ఈ అడుగుజాడలను బట్టి నాకు అపకారం చేసే శత్రువులు ఈ గుహలో ప్రవేశించినట్లున్నారు. ఇప్పుడు నేను గుహలోకి వెళితే ప్రాణాపాయం కలగవచ్చు. కాబట్టి తెలివిగా వ్యవహరించాలి” అని మనసులో అనుకుంది నక్క. కొద్దిసేపు ఆలోచించిన తరువాత నక్కకు ఒక మంచి ఉపాయం తట్టింది. ఉపాయం ప్రకారం గుహతో మాట్లాడసాగింది.

“ఓ గుహ! ఈరోజు మౌనంగా ఉన్నావెందుకు. నేను ప్రతిరోజు రాగానే మాట్లాడేదానివి కదా? ఈరోజు నీకు ఏమైంది?” అని గుహను ప్రశ్నించింది నక్క. నక్క మాట్లాడుతున్నదేమిటో సింహానికి అర్థం కాలేదు. “గుహలు ఎక్కడైనా మాట్లాడతాయా? అయినా నేను మాట్లాడకపోతే నక్క గుహలోపలికి రాదు. నోటి వద్దకు వచ్చిన ఆహారం దూరమౌతుంది. తెలివిగా వ్యవహరించాలి” అని భావించింది సింహం. ఇంతలో నక్క తిరిగి ఏదో మాట్లాడింది. అందుకు సింహం బదులిస్తూ “అదేంకాదు మిత్రమా! నీకంటే నాకు ఎక్కువ ఎవరు? గుహలోపలికిరా?” అని సింహం అన్నది. సింహం మాటలు విన్న నక్క గుహలోపల తనకు హాని చేసే వారుఉన్నారని తెలుసుకుంది. లోపలికి వెళితే ఆ క్రూరమృగానికి తాను బలికాక తప్పదని భావించిన నక్క, వెనుతిరగకుండా పరుగులుతీసి సుదూర ప్రాంతానికి వెళ్ళి ప్రాణాలను రక్షించుకుంది. అడవికి రాజును అనుకున్న సింహం సైతం తన తెలివి తక్కువతనంతో నోటి వద్దకు వచ్చిన ఆహారాన్ని పోగొట్టుకుంది. నక్క తన తెలివితేటలతో ప్రాణాలను కాపాడుకుంది.

MORAL : మనం ఏదైనా ప్రమాదా స్థితిలో ఉన్నప్పుడు కంగారు పడకుండా, తెలివిగా ఆలోచించి ఆ ప్రమాదం నుండి మనకు మనం రక్షించుకోవాలి.

ఎలుక బుద్ధి

ఒక రంధ్రంలో ఎలుక ఒకటి నివసిస్తుంది. ప్రతిరోజు ఒక పిల్లి దాన్ని తినాలని అవకాశం కోసం ఎదురు చూస్తుంది. పిల్లి తనను ఎక్కడ తినేస్తుందో అని అనుక్షణం భయంతో ఎలుక జీవించేది. చివరకు ఆ ఎలుక అడవిలోకి పారిపోయింది. దానికి అక్కడ ఒక ఆశ్రమం కనిపించింది. అందులో ఒక ముని నివసిస్తున్నాడు. తన ప్రాణ భయం గురించి మునితో ఎలుక చెప్పింది. “నువ్వు ఎలుకగా ఉన్నంత కాలం ఏదో ఒక జంతువుతో నీ ప్రాణాలకు ముప్పు కలుగుతుంది. కాబట్టి నిన్ను ఒక సుందర కన్యగా మార్చేస్తాను” అని చెప్పి ఎలుకను అందాల కన్యగా ముని మార్చేశాడు. అంతటి అందాల రాశి తన వద్ద ఉండటం శ్రేయస్కరం కాదని సూర్యుడితో వివాహం చేయాలని, సూర్యుడి వద్దకు తీసుకుని పోయాడు ముని. “అమ్మో! ఈ సూర్యుడి వేడిని నేను భరించలేను” అన్నది అందాల రాశి. “అయితే మేఘుడిని వివాహం చేసుకో” అన్నాడు ముని. “నాలాంటి అందాల రాశి ఈ నల్లని మేఘుడ్ని పెళ్ళిచేసుకోవడామా? కుదరదు” అని తేల్చి చెప్పింది.

అప్పుడు ఆ ముని గాలిదేవుడి వద్దకు అందాల రాశిని తీసుకుని వెళ్ళి పెళ్ళి చేసుకోమన్నాడు. “ఒకచోట స్థిరనివాసం లేని గాలి దేవుడ్ని పెళ్ళాడితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే. నేను చేసుకోను” అన్నది అందాల రాశి. “ఈ పర్వతాన్ని పెళ్ళిచేసుకో” అన్నాడు ముని. “సుకుమారినైన అందాల రాశిని, బండలాంటి ఈ పర్వతాన్ని చేసుకోవడమా? చేసుకోను” అన్నది అందాల రాశి. “నువ్వు ఎవరిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావో చెప్పుతల్లీ!” అన్నాడు ముని. అప్పుడు ఒక కొండను తవ్వుతున్న ఎలుక ఆమె కంట పడింది. “ఇంత పెద్ద కొండను తవ్వుతున్న ఎలుక చాలా గొప్పవాడు. నేను ఇతడిని పెళ్ళి చేసుకుంటాను” అన్నది అందాల రాణి. “అందాల రాశిగా మారినా నీ ఎలుక బుద్ధి మారలేదు. నీ చావు నువ్వు చావు” అని ఆ అందాల రాశిని ఎలుకకు ఇచ్చి పెళ్ళి చేశాడు.

MORAL : చుట్టుపక్కన పరిస్థితులను మరియు మన పరిస్థితులను బట్టి మనము ఇతరులతో సరిగ్గా వ్యవహరించాలి. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *